ఇప్పుడేం చేద్దాం మరి!

Anil Ravipudi's two options
Tuesday, July 14, 2020 - 09:45

లాక్ డౌన్ మొదలవ్వడానికి ముందే తన రైటర్స్ టీమ్ తో కలిసి సొంతూరుకు వెళ్లిపోయాడు దర్శకుడు అనీల్ రావిపూడి. "ఎఫ్3" మీద వర్క్ చేస్తున్నట్టు అప్పట్లోనే ప్రకటించాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. ఇక పనిలో పడదామనుకున్న టైమ్ కు అన్నీ బంద్ అయ్యాయి. దీంతో అనీల్ రావిపూడి ప్లాన్స్ కూడా మారిపోయాయి.

"ఎఫ్ 3" ఇప్పట్లో స్టార్ట్ అవ్వదు. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. హీరో వెంకటేష్ ... ఈ ఇయర్ చేయలేనని  తన వెర్షన్ క్లియర్ గా చెప్పేశాడు. నెక్స్ట్ ఇయర్... అన్ని కుదిరితే ఎప్పుడో అప్పుడు షురూ అవుద్ది. మరి గ్యాప్ లో ఈ డైరక్టరు ఏం చేయబోతున్నాడు..?

ప్రస్తుతం అనిల్ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి బాలయ్యతో ఎప్పట్నుంచో అనుకుంటున్న సినిమాను మళ్లీ బుట్ట నుంచి తీయడం. ఈ పని చేసినా అనిల్ కు గిట్టుబాటు అవ్వకపోవచ్చు. ఎందుకంటే, బోయపాటితో చేస్తున్న సినిమాను బాలయ్య ఇంకా కొలిక్కి తీసుకురాలేదు. కాబట్టి ఇక్కడ కూడా రావిపూడికి వెయిటింగ్ తప్పదు. మరోవైపు యంగ్ హీరో రామ్ ఆప్షన్ ఉండనే ఉంది.

మరి అనిల్ రావిపూడి ఈ రెండు ఆప్షన్లలో ఒకటి సెలక్ట్ చేసుకుంటాడా లేక ఎఫ్3 కోసం ఆగుతాడా అనేది చూడాలి.