సరిలేరు బయ్యర్లకి లాభాలు: సుంకర

Anil Sunkara says buyers will get profits on Sarileru Neekevvaru
Sunday, January 12, 2020 - 23:15

"సరిలేరు నీకెవ్వరు" సినిమా...  కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. తొలిరోజే ఈ సినిమా భారీ వసూళ్లు అందుకొంది. కొన్న బయ్యర్లందరికి పెట్టిన డబ్బుపై 50 శాతం అదనపు లాభాలు వస్తాయని అంటున్నారు నిర్మాత అనిల్ సుంకర. కొందరు బయ్యర్లు అప్పుడే లాభాల్లోకి వచ్చారని చెప్తున్నారు. మరో నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా ... మహేష్ బాబు కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. "ఇంకా పండగ స్టార్ట్ కాలేదు. రేపటినుంచి ...పండగ సంబరం మొదలవుతుంది. అంటే ఇంకా మూడు నాలుగు రోజులు భారీ వసూళ్లు ఉంటాయి. ఈ ఫిగర్స్ చూస్తుంటే మతిపోతోంది," దిల్ రాజు చెప్పారు. 
హీరో మహేష్ బాబు కూడా ఈ సినిమా విజయంతో ఆనందంగా సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. 

సరిలేరు నీకెవ్వరు ... అమెరికాలో 2 మిలియన్ డాలర్ల దిశగా సాగుతోంది.