పవన్ తో కొలవరి టైపు సాంగ్?

Anirudh wants pawan to sing a song
Sunday, July 16, 2017 - 11:30

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పాట పాడాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకేనేమో సెంటిమెంట్ కొద్దీ త్రివిక్రమ్ తో ప్రస్తుతం చేస్తున్న సినిమాలో కూడా ఓ పాట పాడడానికి రెడీ అయిపోతున్నాడు పవర్ స్టార్. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే తన తాజా సినిమాలో పవన్ ఓ పాట పాడే ఛాన్స్ ఉంది.

అత్తారింటికి దారేది టైపులోనే పవన్-త్రివిక్రమ్ కొత్త సినిమాలో కూడా ఓ సందర్భంలో ఓ సరదా సాంగ్ వస్తుంది. ఆ పాటను పవన్ పాడితే బాగుంటుందని సంగీత దర్శకుడు అనిరుధ్ ఫీల్ అయ్యాడు. తన ఫీలింగ్ ను త్రివిక్రమ్ కు చెప్పాడు. త్రివిక్రమ్ ఓకే అనేయడం, ట్యూన్ రెడీ అవ్వడం చకచకా జరిగిపోయాయట. అయితే పవన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. 

హీరోలతో పాటలు పాడించడం అనిరుధ్ కు ఇష్టం. గతంలో ధనుష్ తో కొలవరి పాట పాడించింది ఇతడే. ఆ సాంగ్ నేషన్ వైడ్ పాపులర్ అయింది. కొన్ని నెలల పాటు ఓ ఊపు ఊపింది. ఇప్పుడు పవన్ తో కూడా అలాంటి ఊపున్న సాంగ్ నే ప్లాన్ చేశాడట అనిరుధ్. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.