తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్

Anisha Ambrose expecting her first child
Wednesday, April 15, 2020 - 16:45

పెళ్లయిన తర్వాత తల్లి కావడం సహజం. కాకపోతే చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా లాంగ్ గ్యాప్ తీసుకుంటారు. కానీ అనీషా ఆంబ్రోస్ మాత్రం ఆ పని చేయలేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ఈ భామ, పెళ్లయి ఏడాది తిరిగేసరికి తల్లి కావడానికి రెడీ అయింది.

అవును.. అనీషా ఆంబ్రోస్ ఇప్పుడు గర్భవతి. గతేడాది ఫిబ్రవరిలో గుణ జక్కాను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే పరిమితమైపోయింది అనీషా. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అయింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అనీషా ప్రగ్నెంట్ అనే విషయాన్ని మరో హీరోయిన్ తేజశ్వి మడివాడ కన్ ఫర్మ్ చేసింది. అనీషా  ఫొటోను షేర్ చేసి మేటర్ బయటపెట్టింది.

తెలుగులో అనీషాకు పెద్దగా పేరు రాలేదు. అయితే ఎప్పుడైతే గబ్బర్ సింగ్-2లో ఆమెను పవన్ సరసన తీసుకోబోతున్నారనే వార్త బయటకొచ్చిందో అప్పట్నుంచి ఆమె తెగ పాపులర్ అయింది. అయితే ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఆమెను తప్పించి, కాజల్ ను తీసుకున్నారు. ఈ గ్యాప్ లో సెవెన్, ఈ నగరానికి ఏమైంది, ఉన్నది ఒకటే జిందగీ, ఫ్యాషన్ డిజైనర్, మనమంతా లాంటి సినిమాలు చేసిన అనీషా.. ఏ ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు ఎంచక్కా పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అవుతూ.. ఫ్యామిలీతో సెటిలైపోయింది.