ఊహించని మార్పు ఇది

Anjali's stunning makeover
Saturday, November 30, 2019 - 17:30

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, బలుపు, మసాలా, శంకరాభరణం, డిక్టేటర్.. ఈ సినిమాల్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఇందులో అంజలిని చూసిన ప్రతి ఒక్కరు ఆమె సీనియర్ హీరోలకు తప్ప ఎవరికీ పనికిరాదని ముక్తకంఠంతో ఒప్పుకున్నారు. కుర్రహీరోలకు అస్సలు పనికిరాదని తెగేసి చెప్పారు. అప్పట్లో ఆమె ఫిజిక్ అలా ఉండేది బొద్దుగా.

కానీ ఇప్పుడు అంజలిని చూస్తే.. అప్పటి సినిమాల్ని మరిచిపోవడం ఖాయం. అవును.. ఎవ్వరూ ఊహించని మార్పు ఇది. సీతమ్మ అంజలి కాస్తా ఇప్పుడు స్లిమ్ అంజలిగా మారిపోయింది. తాజాగా అంజలికి సంబంధించి నిశ్శబ్దం సినిమా నుంచి విడుదలైన స్టిల్ ఒకటి చూస్తే, వావ్ అనిపించకమానదు. నిజానికి ఈ సినిమా కంటే ముందే అంజలి స్లిమ్ అయింది. జిమ్ లో బాగా కసరత్తులు చేసి బ్రహ్మాండంగా బరువు తగ్గింది. అయితే నిశ్శబ్దం సినిమాకు వచ్చేసరికి మాత్రం ఆమె ఫిజిక్ మరింత అల్ట్రా గ్లామరస్ గా తయారైంది. అప్పుడు సీనియర్లకు మాత్రమే అన్న జనాలంతా ఇప్పుడు కుర్రహీరోలకు కూడా అంజలి సూట్ అవుతుందని అంటున్నారంటే.. ఆమె ఏ రేంజ్ లో కష్టపడి ఈ ఫిజిక్ సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

అంతా బాగానే ఉంది అంజలికి ఇబ్బందికరంగా మారిన విషయం ఒకటే. క్రేజ్ ఉన్న టైమ్ లో ఆమె బొద్దుగా ఉండేది. కుర్రహీరోలు పట్టించుకోలేదు. క్రేజ్ పోయిన టైమ్ కు ఆమె అల్ట్రా స్లిమ్ గా తయారైంది. ఇప్పుడు కూడా కుర్రహీరోలు పట్టించుకోవట్లేదు.