ఇంకో అట్రాక్షన్.... మీకు అర్థమౌతోందా!

Another comedy scene to be added to Sarileru Neekevvaru
Wednesday, January 22, 2020 - 17:45

మీకు అర్థమౌతోందా అనే డైలాగ్ వినిపిస్తే చాలు ఎవరికైనా రష్మిక, ఆ వెంటనే సరిలేరు నీకెవ్వరు సినిమా గుర్తుకు వస్తుంది. ఇప్పుడీ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ప్రేక్షకులకు మరిన్ని నవ్వులు పంచేందుకు, అదనంగా మరో కామెడీ సీన్ ను యాడ్ చేయబోతోంది యూనిట్.

సినిమాకు ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న సన్నివేశాన్ని జోడించబోతున్నట్టు అనీల్ రావిపూడి స్పష్టంచేశాడు. అది కూడా కామెడీ సీన్ అనే విషయాన్ని బయటపెట్టాడు. . సినిమాలో ట్రయిన్ ఎపిసోడ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఎడిటింగ్ లో ఓ సీన్ ను లేపేశారు.
అలా కత్తిరించిన సన్నివేశాన్ని ఈ వీకెండ్ నుంచి యాడ్ చేయబోతున్నారు. రిపీట్ ఆడియన్స్ కు మరింత ఫన్ అందించేందుకు ఈ నిర్ణయం తీసున్నామని చెబుతున్నాడు. 
రావు రమేష్ కుటుంబానికి, మహేష్ కు మధ్య వచ్చే ఈ ఫన్ సీన్ అందరికీ నచ్చుతుందంటున్నాడు.

సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా బయటపెట్టాడు దర్శకుడు. ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. మరో పెద్ద ఈవెంట్ నిర్వహించబోతున్న విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మహేష్ తిరిగొచ్చిన వెంటనే.. ఫినిషింగ్ సెషన్ కింద మరో భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.