అన‌సున‌సూయ‌లు: సెల్ఫీ..ప్రైవ‌సీ

Ansuya gets trolled for her rude behaviour with a kid
Tuesday, February 6, 2018 - 15:15

అన‌సూయ‌పై కేసు న‌మోదయింది. ఎందుకు? సెల్ఫీ అడిగిన ఒక అబ్బాయి ఫోన్‌ని విసిరికొట్టినందుకు! ఐతే ఆ అబ్బాయి త‌ల్లి అబ‌ద్దం చెపుతోందంటోంది అన‌సూయ‌. అస‌లు మేట‌ర్ ఏంటి...

తార్నాక వచ్చిన అన‌సూయ‌తో సెల్ఫీ దిగాల‌నుకున్నాడు ఓ ప‌దేళ్ల బాలుడు. టీవీల్లో, సినిమాల్లో క‌నిపించే సెల‌బ్రిటీ త‌మ ఏరియాకి రావ‌డంతో ఆ పిల్లాడు ఎక్స‌యిట్ ఆమెతో ఫోటో దిగాల‌నుకున్నాడు.  ఐతే త‌న మూడు బాలేదు అన్న ఉద్దేశంతో ఆమె నిరాక‌రించింది. ఐనా ఆమె త‌ల్లి వీడియో తీసే ప్ర‌య‌త్నం చేయ‌డంతో అన‌సూయ ఫోన్‌ని నేల‌కి విసిరికొట్టింది.

దాంతో ఆగ్ర‌హించిన ఆ బాలుడి త‌ల్లి పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. ఐతే అన‌సూయ వెర్స‌న్ మ‌రోలా ఉంది. త‌న త‌ల్లిని చూడ‌డానికి తార్నాక వెళ్లాన‌నీ, చూసి బ‌య‌టికి వ‌స్తున్న టైమ్‌లో వీరు వీడియో తీయ‌డం మొద‌లుపెట్టారు. చికాకులో ఉన్నాను, ఇపుడు సెల్ఫీ దిగ‌న‌ని చెప్పానంటోంది అన‌సూయ‌. ఐనా నా వీడియో తీయ‌డం మొద‌లుపెట్టారు, దాంతో కార్లోకి వెళ్లి దాక్కున్నా, ఆ టైమ్‌లో ఫోన్ బ్రేక్ అయి ఉంటుంద‌ని అన‌సూయ అందంగా క‌వ‌రింగ్ ఇచ్చింది.

ప‌దేళ్లు కూడా నిండ‌ని ఓ బాలుడు ఫోటో అడిగితే ఏ సెల‌బ్రిటీ ఐనా కాద‌నరు. కానీ ఈ అందాల సుంద‌రికి త‌న ప్రైవ‌సీ దెబ్బ‌తీస్తున్న‌ట్లు అనిపించింద‌ట‌. ఓ సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌కి ప‌దివేల రూపాయల ఫోన్ ప‌గిలితే ఎంత బాధ ఉంటుందో కూడా తెలియ‌కుండా ఆ పిల్లాడి త‌ల్లి అబద్దాలు ప్ర‌చారం చేస్తోంద‌ని అన‌సూయ మాట్లాడ‌డం ఆమె ఇమేజ్‌ని మ‌స‌క‌బారుస్తోంది.