సినిమాల్లేవు.. ఐనా రోవర్ కొనుక్కుంది!

Anu Emmanuel buys Range Rover
Monday, February 3, 2020 - 19:45

ఈ హాట్ ఫోటోలు చూశారా: అను ఇమ్మాన్యూల్

అను ఎమ్మాన్యుయేల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పేరు చెప్పమంటే కాస్త కష్టమే. పాప సైడ్ అయి చాన్నాళ్లయింది. ఆమెకు తెలుగులో అవకాశాలు సున్నా. అయితేనేం లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తోంది ఈ  అమ్మడు. ఏకంగా రేంజ్ రోవర్ కారు కొనుక్కుంది. ఆమెకు సినిమాలతో సంబంధం లేదు. స్వతహాగానే సౌండ్ పార్టీ. అందుకే ఇలా బ్రాండ్ న్యూ కారు తీసింది.

తెలుగులో అను ఎమ్మాన్యుయేల్ నటించిన లేటెస్ట్ మూవీ శైలజారెడ్డి అల్లుడు. ఆ మూవీ తర్వాత ఆమెకు పిలిచి అవకాశం ఇచ్చే వాళ్లు కరువయ్యారు. పైగా ఆ వెంటనే ఆమె కుటుంబ సమస్యల్లో కూడా పడింది. శైలజారెడ్డి అల్లుడు ఫ్లాప్ అవ్వడం, ఒకేసారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చుట్టుముట్టడంతో అను పూర్తిగా సినిమాలకు దూరమైంది.

ప్రస్తుతం ఆమె సినిమా ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోంది. తెలుగులో ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కుదిరితే బెల్లంకొండ కొత్త సినిమాలో ఆమెను సెకెండ్ హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఏడాదంతా ఇలా మరోసారి లక్ చెక్ చేసుకోవాలని నిర్ణయించింది అను. ఈ ఏడాది కూడా క్లిక్ అవ్వకపోతే, తిరిగి అమెరికా చెక్కేయాలనే ప్లాన్ లో ఉంది ఈ ఎన్నారై బ్యూటీ.