అనుంగు తమ్ముడితో

Anu Emmanuel pairs up with Sirish
Saturday, March 7, 2020 - 13:15

ఒకే హీరోయిన్ అటు అన్నతోనూ, ఇటు తమ్ముడితోనూ నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తండ్రితోనూ, కొడుకుతోనూ నటించిన శ్రీదేవి వంటి వారూ ఉన్నారు. బాబాయి అబ్బాయి తో డ్యూయెట్స్ పాడిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. టాలీవుడ్ లో కుటుంబ హీరోల హవా కాబట్టి హీరోయినులకి ఇలా జతకట్టడం తప్పదు. తాజాగా అను ఇమ్మానుయేల్ కూడా ఈ జాబితాలోకి జాయిన్ అయింది. 

అను.. అల్లు అర్జున్ సరసన 'నా పేరు సూర్య' సినిమాలో నటించింది. ఇప్పుడు అల్లు అర్జున్ అనుంగు తమ్ముడితోనూ జతకడుతోంది అను. అల్లు శిరీష్ కొంత గ్యాప్ తీసుకొని.. ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. రెండు సినిమాలు ఒప్పుకున్నాడట. అందులో ఒక మూవీలో అను హీరోయిన్. హీరోయిన్ గా మళ్లి బిజీ అవ్వాలని తెగ ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు శిరీష్ సినిమాకి బుక్ అయింది. 

ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో కూడా కొత్త సెక్సీ ఫోటోలు ఎక్కువగా అప్డేట్ చేస్తోంది. ఇలా అవకాశాల కోసం అన్ని ప్రయత్నాలు ఫుల్లుగా చేస్తోంది.

ఆమె కొత్త ఫోటోలు చూడండి ఇక్కడ : Click for Anu Emmanuel photos