నా గూగుల్ పూరి జగన్నాథ్: అనూప్

"హలో" సినిమాతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్. 50 సినిమాలు పూర్తిచేయడానికి తనకి సహకరించిన దర్శకులు, నిర్మాతలు, హీరోలకు థ్యాంక్స్ చెప్పాడు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు అనూప్. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు చెబుతూనే.. దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.
"పూరి సార్‌తో బాగా క్లోజ్‌గా వుంటాను. నాకు బాగా నచ్చిన వ్యక్తి. వెరీ కూల్ అండ్ వెరీ నాలెడ్జ్‌బుల్ పర్సన్. ఆయన నా పక్కనుంటే గూగుల్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయనతో నేను 'హార్ట్ ఎటాక్', 'టెంపర్' 'పైసా వసూల్' చిత్రాలకు వర్క్ చేశాను. అలాగే 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమా రీరికార్డింగ్ చేశాను. ఆయనకి థాంక్స్." ఇలా పూరి జగన్నాధ్ ను ఆకాశానికెత్తేశాడు అనూప్.
నిజానికి కెరీర్ లో చాన్నాళ్ల వరకు అనూప్ కు అవకాశం ఇవ్వలేదు పూరి జగన్నాధ్. నితిన్ కు అనూప్ సెంటిమెంట్ గా మారిన రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో "హార్ట్ ఎటాక్" సినిమాతో అనూప్ కు అవకాశమిచ్చాడు. ఇక అప్పట్నుంచి అనూప్ ను రెగ్యులర్‌గా రిపీట్ చేస్తూనే ఉన్నాడు.
- Log in to post comments