నడుము చూసినందుకు ఫీలైంది

Anupama morphing pics go viral
Friday, April 10, 2020 - 17:00

ఖుషీ సినిమాలో ఓ సీన్ ఉంది. నా నడుము చూశావంటుంది హీరోయిన్. లేదు చూడలేదంటాడు హీరో. అది కాస్తా పెద్ద గొడవగా మారిపోయి హీరోహీరోయిన్లు విడిపోయే వరకు వస్తుంది పరిస్థితి. సినిమాకు అదే ట్విస్ట్. సరిగ్గా ఇలాంటి నడుము గొడవే అనుపమ పరమేశ్వరన్ దగ్గర మొదలైంది.

సాధారణంగా మార్ఫింగ్ ఫొటోలంటే ఎవరైనా న్యూడ్ ఫొటోలు అనుకుంటారు. కానీ అనుపమ వీరాభిమాని ఒకడు అలాంటి పాడు పని చేయలేదు. ట్రెడిషనల్ గా ఉన్న అనుపమను కాస్త గ్లామరస్ గా మాత్రమే చూపించాలనుకున్నాడు. అందుకే నడుము చూపించే ఓ అమ్మాయి బాడీకి, అనుపమ ముఖాన్ని తగిలించి మార్ఫింగ్ చేశాడు. పైన మనం చూస్తున్న ఫొటో అదే.

ఆ అభిమాని రసహృదయం ఎలా ఉన్నా ...  అలా ఎలా మార్ఫింగ్ చేస్తారంటూ ఫైర్ అయ్యారు ఆమె ఇతర అభిమానులు. అనుపమ అసలు ఫొటో, ఫేక్ ఫొటో అంటూ రెండు స్టిల్స్ తో ప్రచారం మొదలుపెట్టారు.

మార్ఫింగ్ చేయడం తప్పే. దాన్ని ఎవ్వరూ సమర్థించరు. కానీ ఈ మార్ఫింగ్ స్టిల్ పై అనుపమ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ మాత్రం కాస్త ఓవర్ అనిపిస్తోంది. ఈ మార్ఫింగ్ కే వీళ్లు ఇంత ఫీల్ అవుతుంటే.. గతంలో త్రిష, నయనతారకు చేసిన మార్ఫింగ్ ఫొటోలు చూసి ఆ తారల ఫ్యాన్స్ ఇంకెంత ఫీల్ అవ్వాలో!