అనుష్కపై మరోసారి పుకార్లు

Anushka has signed a new film?
Friday, July 24, 2020 - 23:15

అనుష్కకు పుకార్లు కొత్తకాదు. ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ పై కూడా ఎప్పటికప్పుడు గాసిప్స్ వస్తుంటాయి. మొన్నటివరకు ఆమె పెళ్లిపై పుకార్లు వచ్చాయి. తాజాగా ఆమె కెరీర్ కు సంబంధించి మరో న్యూస్ బయటకొచ్చింది. త్వరలోనే మరో సినిమా చేయబోతోందట అనుష్క

ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అనుష్క. గతంలో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నటించింది అనుష్క. ఇప్పుడు మరోసారి అతడి డైరక్షన్ లోనే సినిమా చేసేందుకు రెడీ అవుతోందట.

నిజానికి అనుష్క ఇక సినిమాలు ఆపేస్తుందని, పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతుందని మొన్నటివరకు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా మరో సినిమాకు కమిట్ అయిందనే వార్త.. ఆమె అభిమానులకు గుడ్ న్యూసే. అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. అది రిలీజైన తర్వాత తన నెక్ట్స్ మూవీ డీటెయిల్స్ ను అనుష్క వెల్లడించే అవకాశం ఉంది.