అనుష్క సర్.. అనుష్క అంతే!

Anushka looks in her old style
Tuesday, February 25, 2020 - 08:45

అల వైకుంఠపురములో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. మేడమ్ సర్.. మేడమ్ అంతే అంటాడు ఎంతో ఎక్సయిటింగ్ గా బన్నీ. డైలాగ్ లో మీనింగ్ లేకపోయినా, ఆ సిచ్యుయేషన్ కు అది పెర్ ఫెక్ట్ సింక్. ఇప్పుడిదే డైలాగ్ ను అనుష్క చూసి అంటున్నారు జనాలు. అప్పుడప్పుడు మాత్రమే మీడియాలో కనిపించే అనుష్క, తాజాగా ఓ పబ్లిక్ ఫంక్షన్ కు వచ్చింది. ఆమెను చూసిన జనాలంతా అనుష్క సర్.. అనుష్క అంతే అంటున్నారు.

ఫీల్డ్ కొచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ అదే అందం, ముఖంలో అదే చురుకుదనం, నవ్వులో అదే మెరుపు. గ్లామర్ పరంగా అనుష్క ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అవే చురకత్తుల్లాంటి కళ్లు, మనసుకు హత్తుకునే నవ్వు. హిట్ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన అనుష్కను చూసి ఆడియన్స్ అంతా ఇదే ఫీల్ అయ్యారు.

ప్రస్తుతం అనుష్క సినిమాలు తగ్గించింది. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు అనుష్క. సైరా సినిమాలో ఇలా మెరుపులా కనిపించి అలా మాయమైంది. ఆమె చేసిన ఒకే ఒక్క సినిమా నిశ్శబ్దం. ప్రస్తుతం ఆ మూవీ కోసం అనుష్క ఫ్యాన్స్ ఈగర్ గా వెయిటింగ్.