అనుష్కను పెళ్లి చేసుకోను:ప్రభాస్

Anushka is my friend, not girfriend: Prabhas
Tuesday, January 2, 2018 - 15:15

ప్రభాస్, అనుష్క మేటర్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కొన్నేళ్లుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమధ్య ఒకసారి దీనిపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. తనుకు అనుష్కకు మధ్య ఏం లేదని స్పష్టంచేశాడు. కానీ ఈ పుకార్లు మాత్రం ఆగలేదు.

విరుష్క టైపులో ప్ర‌వుష్క‌ అంటూ సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతోంది. దీంతో మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్.

"ఒక నటితో అనేక సినిమాలు చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య రిలేషన్‌ ఉందంటూ వార్తలు రావడం కామన్. నాకు, అనుష్క విషయంలో కూడా అదే జరిగింది. కానీ అనుష్క, నేను... ఇప్పటికీ ఎప్పటికీ మంచి స్నేహితులమే. అంత‌కుమించి ఏమీ లేదని ప్ర‌భాస్ జీక్యూ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

38 ఏళ్ల ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇదిగో..ఇదిగో అంటూ ప్రతి ఏటా పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. దీంతో అనుష్కను పెళ్లి చేసుకుంటాడంటూ పుకార్లు వస్తున్నాయి. ఈ రూమర్లు ఆగిపోవాలంటే అటు ప్రభాస్ లేదా ఇటు అనుష్కలో ఎవరో ఒకరు తొందరగా పెళ్లి చేసుకోవాలి కాబోలు.