అందుకే త‌గ్గ‌లేక‌పోతున్నా: అనుష్క

Anushka reveals why she is not losing much weight
Tuesday, January 23, 2018 - 15:45

అనుష్క అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఆమె బ‌రువు ఎందుకు త‌గ్గ‌లేక‌పోతుందో మీడియాకి తెలిపింది. ఒక సినిమా షూటింగ్ టైమ్‌లో ఆమె గాయ‌ప‌డింద‌ట‌. ఆ టైమ్‌లో స‌ర్జ‌రీ చేయించుకొంది. దానివ‌ల్ల‌ ఏర్ప‌డ్డ కాంప్లికేష‌న్స్‌తో ఆమె మెటాబిలిజం దెబ్బ‌తింద‌ట‌. అందుకే చాలా ప్ర‌య‌త్నాలు చేసినా.. ఆమె ఎక్కువ బ‌రువు త‌గ్గ‌లేక‌పోయింది.

రీసెంట్‌గా ఆమె కొంత స‌న్న‌బ‌డింది. అయితే అంతకుముందు బాగా లావు కావ‌డం వ‌ల్లా.. ఆమె బ‌రువు త‌గ్గినా..పెద్ద‌గా ఆకృతిలో మార్పు క‌నిపించ‌డం లేదు. ఐతే స‌న్న‌బ‌డ‌డం అనేది నిరంత‌ర ప్ర‌క్రియ అని అంటోంది. ప్ర‌స్తుతం కూడా వెయిట్‌లాస్ మెథ‌డ్‌లోనే ఉంద‌ట‌. వ‌చ్చే ఏడాదికి చాలా మార్పు క‌నిపించొచ్చు.

"భాగ‌మ‌తి" సినిమా విడుద‌ల త‌ర్వాత అనుష్క గౌత‌మ్ మీన‌న్ సినిమాలో క‌నిపించ‌నుంది. ఇది త‌ప్ప మ‌రో మూవీ అంగీక‌రించ‌లేదు. ఐతే సినిమాల విష‌యంలో ఆమె ఇక తొంద‌ర‌ప‌డ‌ద‌ట‌. న‌చ్చిన క‌థ‌లనే సెల‌క్ట్ చేసుకుంటుంద‌ట‌. 36 ఏళ్ల అనుష్క పెళ్లిని కూడా మ‌రోసారి వాయిదావేసింది.