నిశ్శ‌బ్దంగా స‌గం పూర్తి చేసిన స్వీటీ

Anushka Shetty completes 50 percent of Nishabdam
Monday, July 1, 2019 - 15:30

అనుష్క షెట్టి స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేస్తోంది. ఆమె చాలా గ్యాప్ త‌ర్వాత సెట్స్‌పైకి వ‌చ్చింది. ఏడాదిన్న‌ర మేక‌ప్ వేసుకొంది. ఐతే దూకుడు మాత్రం త‌గ్గ‌లేదు. ఆమె తాజాగా న‌టిస్తోన్న మూవీ...నిశ్శ‌బ్దం. హేమంత్ మ‌ధుక‌ర్ అనే ద‌ర్శ‌కుడు తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, ఇంగ్లీషు భాష‌ల్లో తీస్తున్నాడు. మాధ‌వ‌న్ హీరో. కోన వెంక‌ట్ ప్రెజెంట‌ర్‌.

ప్ర‌స్తుతం షూటింగ్ అమెరికాలో సాగుతోంది. అపుడే 50 శాతం షూటింగ్ పూర్త‌యింద‌ట‌. ద‌ర్శ‌కుడు హేమంత్ ఈ విష‌యాన్ని అప్‌డేట్ చేశాడు. అనుష్క స్పీడ్‌గా వ‌ర్క్ చేస్తుండ‌డంతో నెల రోజుల్లోనే 50 శాతం వ‌ర్క్ పూర్త‌యింద‌ట‌.

భాగ‌మ‌తి సినిమా విడుద‌ల త‌ర్వాత అనుష్క సైన్‌చేసిన మూవీ ఇదే. ఏడాదిన్న‌ర పాటు షూటింగ్‌ల‌కి దూరంగా ఉండి స‌న్న‌బ‌డింది.