అనుష్క ఏడుపు కలిసొచ్చింది

Anushka's crying promo fetches TV ratings
Friday, April 3, 2020 - 10:30

అనుష్క ఏడ్చింది.
పక్కనే ఉన్న సుబ్బరాజు ఓదార్చాడు.
బాయ్ వచ్చి వాటర్ బాటిల్ అందించాడు.

అంతే.. మూడంటే మూడు షాట్స్. ఈ 3 కట్స్ తోనే క్యాష్ ప్రొగ్రామ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సుమ యాంకరింగ్ చేసే ఈ కార్యక్రమానికి అనుష్క స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. నిశ్శబ్దం ప్రమోషన్ కోసం బొమ్మాళి వచ్చిందనే విషయాన్ని పక్కనపెడితే.. అనుష్క కెరీర్ లో ఈ తరహా కార్యక్రమానికి ఆమె హాజరవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. పైగా ఆమె అందులో ఏడ్చింది.

ఇంకేముంది.. అనుష్క ఎందుకు ఏడ్చిందా అని జనాలు టీవీలకు అతుక్కుపోయారు. దీంతో క్యాష్ కాస్తా సూపర్ హిట్టయింది.  తాజాగా వచ్చిన రేటింగ్స్ లో క్యాష్ కార్యక్రమానికి ఏకంగా 11.57 (ఏపీ, తెలంగాణ అర్బన్) టీఆర్పీ వచ్చింది.

సాధారణంగా ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమానిదే డామినేషన్. టాప్ రేటింగ్స్ దానికే వస్తుంటాయి. క్యాష్ కార్యక్రమం కూడా టాప్-5లో ఉంటుంది. అయితే ఈసారి కొన్ని సెగ్మెంట్స్ లో జబర్దస్త్ ను కూడా క్రాస్ చేసింది క్యాష్. అంతా అనుష్క ఏడుపు మహత్యం.

ప్రభాస్ ను మిస్ అయినందుకు అనుష్క ఏడ్చినట్టు ప్రోమోలో చూపించారు. కట్ చేస్తే.. కోడి రామకృష్ణ మృతి పట్ల అనుష్క ఏడ్చిందనే విషయం ఆరోజు (21వ తేదీ) కార్యక్రమం చూసినవాళ్లకు అర్థమైంది.