రెహ్మాన్ కి కోపమొచ్చింది

AR Rehman is angry over Masakali' remix song
Thursday, April 9, 2020 - 13:15

"మొజార్ట్ అఫ్ మద్రాస్" అని పేరు తెచ్చుకున్న ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కి కోపమొచ్చింది. ఒక పాట రీమిక్స్ వల్ల అతనికి చిర్రెతుకొచ్చింది. ఇటీవల బాలీవుడ్ లో రెహమాన్ పాటలను రీమిక్స్ చేసి వదులుతున్నాయి ఆడియో కంపెనీలు. బొంబాయి లోని "హమ్మా హమ్మా" పాట నుంచి రీసెంట్ సాంగ్స్ వరకు చాలానే వచ్చాయి. మొదట్లో వీటిపై రెహ్మాన్ సైలెంట్ గా ఉన్నారు. 

ఐతే, "ఢిల్లీ 6" సినిమాలోని "మసకల్లి" పాటకి రీమిక్స్ వెర్షన్ గా "మసకల్లి 2.0" అంటూ ఒక ఆల్బమ్ ని రిలీజ్ చెయ్యడంతో రెహ్మాన్ కి ఆగ్రహం కట్టలు తెంచుకొంది. "ఎందరో కష్టం, క్రియేటివిటీ వల్ల పుట్టిన పాట ... మసకల్లి. దాన్ని ఇలా ఖూనీ చేస్తారా" అంటూ ఫైర్ అయి, తనదైన శైలిలో తన ఒరిజినల్ సాంగ్ ని షేర్ చేశారు రెహమాన్. 

అయనకి మద్దతుగా పలువురు సింగర్స్, మ్యూజిక్ డైరక్టర్లు ట్వీట్స్ వేశారు. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.