నెల్లూరులో అర్జున్‌రెడ్డి హీరోయిన్‌కి ద‌డ‌!

Arjun Reddy heroine Shalini Pandey gets frightened in Nellore
Wednesday, September 13, 2017 - 15:15

హీరోయిన్ షాలిని పాండేని స్ట్రెచ‌ర్‌పై తీసుకెళ్తున్న విజువ‌ల్స్ క‌ల‌కలం రేపాయి.ఈ సంఘ‌ట‌న‌ బుధవారం (సెప్టెంబ‌ర్ 13) నెల్లూరులో జ‌రిగింది. ఆమె ముఖంపై చున్నీ క‌ప్పి..స్ట్రెచ‌ర్‌పై తీసుకెళ్తున్న సీన్ అక్క‌డ అంద‌రి కంటాప‌డింది. దాంతో జ‌నం  షాక్‌కి గుర‌య్యారు ఆమెకి అంత సీరియ‌స్ ప్రాబ్ల‌మ్ ఏమి వ‌చ్చిందా అని.

కానీ చివ‌రికి తేలింది ఏంటంటే.. నెల్లూరులో ఆమెని చూసేందుకు యూత్‌, జ‌నం అంతా ఎగ‌బ‌డ‌డంతో ఆమెకి ద‌డ పుట్టింది. అంత మంది జనం ఒక్క‌సారిగా చుట్టుముట్ట‌డంతో ఆమె కంగారు ప‌డింది. త‌న చుట్టూ బౌన్స‌ర్‌లు లేక‌పోవ‌డం, సరైన సెక్యురిటీ లేక‌పోవ‌డంతో ఆ స్పాట్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అనారోగ్యం డ్రామా ఆడింది షాలిని. కారులోకి అడుగుపెట్ట‌గానే చున్నీ తీసేసి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న సీన్ కూడా కెమెరాకి చిక్కింది. 

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా పాపుల‌ర‌యిన ఈ భామ‌ని సెల్ పాయింట్ షోరూమ్ ప్రారంభోత్స‌వానికి తీసుకెళ్లారు. నెల్లూరులో ఆమెని చూసేందుకు ఇంత జ‌నం వ‌స్తార‌ని వారు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు. అందుకే ఆమెకి బౌన్స‌ర్ల‌ని ఏర్పాటు చేయ‌లేదు. అంత జ‌నాన్ని చూడ‌డం ఆమెకి కొత్తే. దాంతో కంగారుప‌డి, ఈ డ్రామా న‌డిపించింది ఈ భామ‌.