నాగశౌర్యకి కలిసొచ్చింది

Ashwathama gets better ratings on TV
Thursday, May 21, 2020 - 17:15

బుల్లితెర బరిలో 'అశ్వద్ధామ' గెలిచాడు. లాక్ డౌన్ టైమ్ కావడంతో, అంతా టీవీలకే అతుక్కుపోయిన వేళ.. నాగశౌర్య నటించిన ఈ సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా 15వ తేదీన జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు 9.10 (అర్బన్) టీఆర్పీ రావడం విశేషం.

ఇంతకుముందు శౌర్య హీరోగా నటించిన ఏ సినిమాకు ఈ రేంజ్ టీఆర్పీ రాలేదు. చివరికి శౌర్య-సమంత కలిసి నటించిన ఓ బేబీకి కూడా 9 (అర్బన్) టీఆర్పీ మాత్రమే వచ్చింది. సో.. ఎలా చూసుకున్నా అశ్వద్ధామ సినిమాతో నాగశౌర్య రేటింగ్ చార్టుల్లో టాప్-10లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకున్నాడు.

ఇక ఈ వారం రిలీజైన రేటింగ్స్ లో అశ్వద్ధామ తర్వాత రెండో స్థానంలో బాహుబలి-2, మూడో స్థానంలో ధృవ, నాలుగో స్థానంలో రాజా ది గ్రేట్, ఐదో స్థానంలో ఎఫ్-2 సినిమాలు నిలబడ్డాయి. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ఈడు గోల్డ్ ఎహే సినిమా ఆకట్టుకోలేకపోయింది.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ వారం కూడా హయ్యస్ట్ జీఆర్పీతో స్టార్ మా ఛానెల్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోగా.. రెండో స్థానంలో జెమినీ, మూడో స్థానంలో ఈటీవీ తెలుగు నిలిచాయి.