బ్రేక్ ఈవెన్ చేసిన శౌర్య.

Aswathama breaks even
Thursday, February 6, 2020 - 15:00

విడుదలైన వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేశాడు నాగశౌర్య. లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా  మేకోవర్ అయి ఇతడు తీసిన అశ్వథ్థామ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్-ఈవెన్ అయింది. ఈ మేరకు యూనిట్ నుంచి పోస్టర్ కూడా వచ్చేసింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. 

ఈ సినిమా శౌర్య ఆనందాన్ని డబుల్ చేసింది. ఎందుకంటే ఇందులో కేవలం హీరోగా నటించి చేతులు దులుపుకోలేదు శర్వా. ఈ సినిమాకు తనే స్వయంగా కథ రాసుకున్నాడు. దీని కోసం చాలా రీసెర్చ్ చేశాడు. పైగా తన సొంత బ్యానర్ పై రిస్క్ చేసి సినిమా చేశాడు. కథపై ఎంతో ఇష్టంతో ఛాతిపై సినిమా పేరును పచ్చబొట్టుగా కూడా పొడిపించుకున్నాడు. అందుకే అశ్వథ్థామ ఇచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేనంటున్నాడు ఈ హీరో.