అశ్వథ్థామలో పవన్ కల్యాణ్

Aswathama - Pawan Kalyan voice over
Tuesday, January 28, 2020 - 22:45

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది అశ్వథ్థామ. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కూడా ఉన్నాడు. అవును.. ఈ సినిమాలో పవన్ కనిపించపోయినా పవర్ స్టార్ గొంతు వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే పవన్ కల్యాణ్ డైలాగ్ తోనే అశ్వథ్థామ సినిమా స్టార్ట్ అవుతుంది.

తన సినిమా కోసం పవన్ కల్యాణ్ డైలాగ్ వాడుకున్న విషయాన్ని బయటపెట్టాడు నాగశౌర్య. గోపాల గోపాల సినిమాలో అశ్వథ్థామ గురించి పవన్ ఓ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ తమ సినిమాకు సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో పవన్ డైలాగ్ తోనే సినిమా స్టార్ట్ చేశామని, ఈ మేరకు నిర్మాత శరత్ మరార్ పర్మిషన్ కూడా తీసుకున్నామనే విషయాన్ని వెల్లడించాడు శౌర్య.

ఈ సందర్భంగా మరో విషయం కూడా బయటపెట్టాడు. త్వరలోనే తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై బయట హీరోతో సినిమా నిర్మిస్తానని ప్రకటించాడు. ఆ సినిమాకు వీలైతే తనే కథ అందిస్తానని కూడా చెప్పుకొచ్చాడు. అశ్వథ్థామ సినిమాకు కథ రాసిన ఈ హీరో, ప్రస్తుతం ఓ లవ్ స్టోరీ రాసే పనిలో బిజీగా ఉన్నాడు.