పాన్ ఇండియా.... అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌

Athade Srimannarayana is a pan India film
Thursday, November 28, 2019 - 19:30

కన్నడ హీరో ర‌క్షిత్ శెట్టి నటించిన మూవీ.. అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌' పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రంతో  స‌చిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ లెవ‌ల్లోఈ సినిమానువిడుద‌ల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. తెలుగు ట్రైల‌ర్‌ని నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. .

హీరో ర‌క్షిత్ శెట్టి 
ఈ సినిమాకు శంక‌ర్ నాగ్‌గారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మాల్గుడి డేస్‌` నాకు స్ఫూర్తి. ఆ సినిమాలోని మాల్గుడి ప్ర‌దేశం ద‌క్షిణ భార‌తానికి చెందిన ఉహ‌త్మాక ప్ర‌దేశం.  అది భార‌త‌దేశంలోని అన్ని ప్రాంతాల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమాకోసం 19 సెట్స్ వేశాం. దాదాపు 90 శాతం బెంగ‌ళూరు సెట్స్‌లోనే తీశాం. మిగిలిన భాగాన్ని బీజాపూర్‌, ఉత్త‌ర క‌ర్ణాట‌క‌ల్లో చిత్రీక‌రించాం. అలాగే సినిమా ప్రారంభించి టీజ‌ర్ విడుద‌ల చేసే స‌మ‌యానికి ప్యాన్ ఇండియా మూవీగా చేయాల‌ని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా హ్యూజ్ రేంజ్‌లో విడుదల చేస్తున్నాం. డ‌బ్బింగ్ విష‌యానికి వ‌స్తే క‌న్న‌డ వెర్ష‌న్ ను పూర్తి చేశాను. హిందీ ట్రైల‌ర్‌కు డ‌బ్బింగ్ చెప్పాను. వాయిస్ సెట్ అవ‌డంతో ఇప్పుడు హిందీకి పూర్తి స్థాయిలో డ‌బ్బింగ్ చెప్పాల‌ని అనుకుంటున్నాను. ఇంత పెద్ద సినిమాను పూర్తి చేసి ప్యాన్ ఇండియా మూవీగా చేశామంటే నిర్మాత‌లు అందించిన ప్రోత్సాహ‌మే కార‌ణం. ఈ సినిమా కోసం మూడేళ్లలో 385 రోజ‌లు పాటు క‌ష్ట‌పడ్డాం. డైరెక్ట‌ర్ స‌చిన్ నిద్రాహారాలు మానుకుని రేయింబ‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు. టీమ్ అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు."

అనంత‌రం పాత్రికేయులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులు ఇస్తూ  తెలుగులో త‌న అభిమాన న‌టుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్ట‌మ‌ని తెలిపారు. త‌న న‌ట‌న‌, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లో త‌న ప‌రిణితి త‌న‌కు న‌చ్చుతుంద‌ని తెలిపారు.

"ముందు ఈ సినిమాను 8 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో ప్రారంభించాం. క‌థ‌, స‌బ్జెక్ట్ మీద నమ్మ‌కంతో మంచి చిత్రంగా, నిర్మాణ వ్య‌యంలో రాజీ ప‌డ‌కుండా నిర్మించాం. అలాగే ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాం. ర‌క్షిత్ శెట్టి ఈ సినిమాలో యాక్ట్ చేయడం మాకు హ్యాపీ. త‌న‌తో మ‌రిన్ని చేయాల‌నుకుంటున్నాం," నిర్మాతలు పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ అన్నారు.