OTTలో అమ్మడు, ATTలో కుమ్ముడు!

ATT is Tollywood's new trend
Saturday, July 11, 2020 - 18:00

ఒకప్పుడు సాఫ్ట్ పోర్న్ సినిమాలకు ప్రతి ఊరిలో ప్రత్యేకంగా థియేటర్లు ఉండేవి. ఆ థియేటర్లలో "ఆ సినిమాలు" మాత్రమే ఆడేవి. కాలక్రమంలో ఆ ట్రెండ్ తగ్గిపోయింది. అలా కనుమరుగైపోయిందనుకున్న సాఫ్ట్ పోర్న్ ట్రెండ్ ఈసారి హైటెక్ హంగులతో కొత్త రూపు సంతరించుకుంది. అవును.. ఎనీ టైమ్ థియేటర్ (ATT) కాన్సెప్ట్ తో ఇప్పుడిలాంటి అడల్ట్ సినిమాల్ని వరుసపెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ కి బాట వేసింది రామ్ గోపాల్ వర్మ.

"జీఎస్టీ" తీసినప్పుడు దాన్ని ఎక్కడ రిలీజ్ చేయాలో వర్మకు అర్థం కాలేదు. మొత్తానికి ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడు. ఇక "క్లైమాక్స్", "నగ్నం" సినిమాల నుంచి వర్మ విశ్వరూపం మొదలైంది. దీనికోసం శ్రేయాస్ మీడియా, వర్మ కలిసిస ATT అనే "కొత్త మార్గం"  కనిబెట్టారు. అదిప్పుడు కాసులు కురిపిస్తుండడంతో మరింత మంది మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సారీ.. ఆ దిశగా పరుగులు పెడుతున్నారు.

త్వరలోనే భీమవరం టాకీస్ అనే మరో ఏటీటీ కూడా అందుబాటులోకి రాబోతోంది. వీళ్లంతా తమ మాధ్యమాల్ని చిన్న సినిమాలకు వేదికలుగా పైకి చెబుతున్నప్పటికీ.. లోపల చూపించేది మాత్రం అమ్మడు-కుమ్ముడు మార్క్ సినిమాలే అనే విషయం బహిరంగ రహస్యం.

OTT అంటే నెట్ ఫ్లిక్, అమేజాన్, హాట్ స్టార్ వంటి ఫ్లాట్ ఫారంలో "అమ్మడు" (హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్) సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ATTలో అన్ని కుమ్ముడు సినిమాలే. అవును భీమవరం టాకీస్ పేరుతో ATTలో మొదలవుతున్న మొదటి సినిమా పేరు అదే.. "అమ్మడు కుమ్ముడు".

మొత్తమ్మీద శివతో ట్రెండ్ క్రియేట్ చేసిన వర్మ.. ఇప్పుడు "నగ్నం", "క్లైమాక్స్" సినిమాలతో టాలీవుడ్ కు మరో ట్రెండ్ చూపించాడు. ఇకపై ఓ మోస్తరు సినిమాలన్నీ థియేటర్ లో.. ఇలాంటి సాఫ్ట్ పోర్న్ అడల్ట్ సినిమాలన్నీ "ఎనీ టైమ్ థియేటర్"లో అన్నమాట.