మళ్లీ తెరపైకి ప్రతిష్టాత్మక సంస్థ

AVM to enter into digital space
Saturday, August 1, 2020 - 13:00

ఏవీఎం స్టుడియోస్.. సౌతిండియన్ సినిమాలో ఈ సంస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ఏవీఎం ప్రొడక్షన్స్ సంస్థ.. త్వరలోనే మళ్లీ లైమ్ లైట్లోకి రాబోతోంది. ఈసారి సినిమాలు నిర్మించడంతో పాటు ఓటీటీకి ఒరిజినల్ కంటెంట్ అందించే పని కూడా స్టార్ట్ చేయబోతోంది.

ప్రస్తుతం ఈ సంస్థ ఓ తమిళ సినిమాకు, అదే విధంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ఓ తమిళ్ ఒరిజినల్ సినిమా అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే ఏవీఎం నుంచి ప్రకటన రాబోతోంది.

2014లో తీసిన ఓ తమిళ సినిమా తర్వాత మళ్లీ నిర్మాణ రంగంవైపు రాలేదు ఈ సంస్థ. ఇక తెలుగులో 2010లో వచ్చిన "లీడర్" సినిమా ఈ సంస్థకు చివరి చిత్రం. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఈ తరం రానా వరకు ఎంతోమంది హీరోలతో సినిమాలు నిర్మించిన ఏవీఎం స్టుడియోస్ సంస్థ, మళ్లీ ఎప్పుడు తెలుగులో సినిమా చేస్తుందో చూడాలి.