అయ్యప్పలో హీరో చేంజ్?

Ayyappanum remake to have different hero
Tuesday, July 21, 2020 - 18:30

"అయ్యప్పనుమ్ కోషియమ్".. రీమేక్ చెయ్యాలని ఒక నిర్మాణ సంస్థ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. తాము అనుకున్న హీరోల పేర్లన్నీ మీడియాకి లీక్ చేసింది సదరు సంస్థ. కానీ ఒకటి కూడా వర్క్ అవుట్ కాలేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండాలి. రానా ఫిక్స్. మరో హీరో పాత్ర కోసం బాలకృష్ణ, రవితేజ, వెంకటేష్ ... ఇలా చాలాపేర్లు తెరపైకొచ్చాయి.

ఈ కరోనా టైంలో మీడియాలో కొందరు ఈ ఒక్క న్యూస్ తో చాలా రోజులు కథలు అల్లేశారు. ఐతే, ఇప్పుడు ఇది ఆగిందంటూ మళ్ళీ ప్రచారం మొదలు అయింది. ఇంతకీ "అయ్యప్పనుమ్ కోషియమ్" రీమేక్ ప్రాజెక్టు ఇప్పట్లో మొదలవుతుందా లేదా అన్నది చూడాలి. లేదంటే... అజయ్ భూపతి రెండేళ్లుగా చెప్తోన్న "మహా సముద్రం" ప్రాజెక్ట్ అవుతుందా? 

ఇప్పుడు ఈ లిస్టులోకి మరో "పెద్ద హీరో"ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఆ పెద్ద హీరో కాస్త ఆసక్తి చూపితే... నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో అప్పుడు ఈ రీమేక్ పై టాలీవుడ్ లో మళ్ళీ  చర్చ మొదలవుతుంది. అప్పటివరకు గప్ చుప్.