సెంటిమెంట్ తిరగరాసిన బాహుబలి 2

ఓ సినిమాకు సీక్వెల్ తీస్తే ఫ్లాపే. అలాగే ఒక సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తే రెండో భాగం ఫట్టే. టాలీవుడ్ చరిత్రలో సీక్వెల్ కానీ, రెండో పార్ట్ కానీ హిట్ అయిన దాఖలాల్లేవ్. ఇంత బ్యాడ్ సెంటిమెంట్ ఉంది కాబట్టే హీరోలెవరూ వీటిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇప్పుడా నెగెటివ్ సెంటిమెంట్ ను బాహుబలి 2 తిరగరాసింది. బాహుబలి ది బిగినింగ్ కథకి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి – ది కంక్లూజన్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తూనే, ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రవితేజ.. ఇలా చాలామంది హీరోలు సీక్వెల్స్ ప్రయత్నించారు. కానీ ఎవరూ సక్సెస్ అందుకోలేకపోయారు. శంకర్ దాదా జిందాబాద్, కిక్-2, అవును-2, సర్దార్ గబ్బర్ సింగ్, ఆర్య-2, గాయం-2, మంత్ర-2.. ఇలా ఏ సీక్వెల్ తీసుకున్నా అది ఫ్లాపే.అలాగే రాంగోపాల్ వర్మ రక్తచరిత్రని రెండు భాగాలుగా తీశాడు. మొదటి భాగం హిట్. రెండో భాగం ఢమాల్.
ఎట్టకేలకు ఈ నెగెటివ్ సెంటిమెంట్ ను బాహుబలి 2 తిరగరాసింది. పకడ్బందీ కథతో, కట్టిపడేసే విజువలైజేషన్ తో సినిమా తీస్తే.. అది సక్సెస్ అవుతుందని నిరూపించాడు రాజమౌళి.
- Log in to post comments