బాహుబ‌లి 2కి 1500 కోట్లు రావ‌డం ఫేకా?

Baahubali 2 crosses Rs 1500 Cr, real or fake?
Friday, May 19, 2017 - 18:00

రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది బాహుబలి-2 సినిమా. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 1500 కోట్ల మార్క్ ను ట‌చ్‌ చేశాయి. అయితే ఈ వసూళ్లన్నీ కల్పితమా..? లెక్కలన్నీ ఫేకా...? కావాలనే కలెక్షన్లు పెంచి చెబుతున్నారా...? ఇప్పటివరకు ఎవరికీ రాని అనుమానాలివి. భారతదేశం మొత్తమ్మీద ఒకే ఒక్కడికి వచ్చిన అనుమానం కూడా ఇదే. ఆ ఒక్కడే కమల్ ఆర్.ఖాన్.

సినిమా ఏదైనా, అది ఎంత హిట్ అయినా దాన్ని తిట్టడమే అత‌ని పని. అందరూ తనవైపు చూడాలనే ఉద్దేశంతో సినిమావాళ్లపై, వాళ్లు తీసే సినిమాలపై లేనిపోని అభాండాలు కూడా వేస్తుంటాడు. నలుగురిలో తను ప్రత్యేకంగా ఉండాలి, అంతా నా గురించే మాట్లాడుకోవాలనే సైకో లక్షణమే దీనికి కారణం. ఇప్పుడీ వ్యక్తే బాహుబలి 2 హిందీ వెర్షన్ కు వస్తున్న వసూళ్లను ఫేక్ అంటున్నాడు.

పేరుకు పెద్ద క్రిటిక్ గా చెప్పుకునే ఈ ఆసామి, బాహుబలి 2 సినిమాను హిందీలో ఎవరూ చూడరని రిలీజ్ కు ముందు జోస్యం చెప్పాడు. ఇతడో పెద్ద జోకర్ అనే విషయాన్ని బాహుబలి-2 సినిమా ప్రూవ్ చేసింది. బాలీవుడ్ లో అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టడమే కాకుండా... టోటల్ ఇండియాలోనే నంబర్ వన్ సినిమాగా అవతరించింది. సరిగ్గా ఇక్కడే కే.ఆర్.కే తట్టుకోలేకపోతున్నాడు. కొన్ని వసూళ్లు ఫేక్ అంటున్నాడు.

బాహుబలి-2 హిందీ వెర్షన్ కు తాజాగా 460 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఈ కలెక్షన్లలో 60కోట్ల రూపాయల్ని ఎక్కువగా చూపించారని వాదిస్తున్నాడు. 60కోట్లు ఎక్కువైనా, తక్కువైనా... 400 కోట్లు కలెక్ట్ చేసినప్పుడే బాహుబలి-2 నంబర్ వన్ మూవీ అయిపోయింది. అప్పుడు లేని ఏడుపు ఈ కమాల్ కు ఇప్పుడు పుట్టుకొచ్చింది. ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి.. 60కోట్లు ఎక్కువ చేసి చెబుతున్నారని ట్విట్టర్ సాక్షిగా ఏడుపు అందుకున్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జోక‌ర్‌ని, అతడి ట్వీట్స్ ను ఎవరూ ప‌ట్టించుకోరు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ట్వీట్స్ పెడుతున్న ఆ జోకర్ కే అర్థం కావడం లేదు.