బాహుబలి 2 : లేటెస్ట్ కలెక్షన్లు (12 రోజులు)

Baahubali 2: Total 12 Days Collections
Wednesday, May 10, 2017 - 15:45

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన బాహుబలి-2 సినిమా ప్రతి ఏరియా నుంచి కళ్లుచెదిరే కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ పండిట్స్ కూడా కళ్లుతేలేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. నైజాంలో ఫస్ట్ టైం 50కోట్ల షేర్ క్లబ్ క్రియేట్ చేసింది బాహుబలి-2. ఇప్పటివరకు ఇంత షేర్ అందుకున్న సినిమా ఇంకోటి రాలేదు. విడుదలైన 12 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 151.90 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల షేర్   కోట్లలో (రూపాయ‌లు)
నైజాం 50.15
సీడెడ్ 26.60
ఉత్తరాంధ్ర 19.92
నెల్లూరు 5.85
గుంటూరు 14.27
కృష్ణా 10.72
వెస్ట్ 10.32
ఈస్ట్ 14.07
12 రోజుల మొత్తం షేర్ రూ. 151.90 కోట్లు

అటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా బంపర్ కలెక్షన్లతో సాగిపోతోంది. బాలీవుడ్ లో ఇప్పటికే వసూళ్ల పరంగా నంబర్ వన్ స్థానం సంపాదించుకున్న ఈ సినిమా.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదే జోరు చూపిస్తోంది. 12వ రోజు బాహుబలి-2 హిందీ వెర్షన్ కు 15.5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. 12 రోజుల్లో హిందీ వెర్షన్ కు 359.75 కోట్లరూపాయల షేర్ వచ్చింది.

మరోవైపు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా తన హవా చాటుతోంది. మంగళవారం ఈ సినిమాకు 3లక్షల16వేల డాలర్లు వచ్చాయి. ఉత్తర అమెరికా, కెనడా దేశాల్లో వచ్చిన కలెక్షన్ల మొత్తమిది. ఈ మొత్తం కలుపుకుంటే.. విడుదలైన 12 రోజుల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా 17 మిలియన్ డాలర్లు ఆర్జించింది.

మరోవైపు ఓవరాల్ వరల్డ్ వైడ్ వసూళ్లలో బాహుబలి-2 సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ 12 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలు వచ్చాయి.