దంగల్ ను దాటేసిన బాహుబలి 2

Baahubali 2 turns highest grossing Hindi film ever
Friday, May 12, 2017 - 15:15

అంతా ఊహించినట్టే జరిగింది. 2 వారాలు గడిచేసరికి ఇండియా వైడ్ రికార్డుల్ని బాహుబలి-2 సినిమా తుడిచిపెట్టేస్తుందని అంతా ఊహించారు. ఇప్పుడదే జరిగింది. ఇండియావైడ్ సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది.

ఇప్పటివరకు ఇండియాలో అత్యధిక వసూళ్ల రికార్డు దంగల్ పేరిట ఉండేది. అమీర్ నటించిన దంగల్ సినిమాకు ఫైనల్ రన్ లో 387 కోట్ల రూపాయల నెట్‌ వచ్చింది. ఇప్పుడీ రికార్డును జస్ట్ 2 వారాల్లోనే క్రాస్ చేసింది బాహుబలి -2. ఈ సినిమా హిందీ వెర్షన్ కు బాలీవుడ్ లో ఇప్పటివరకు 392 కోట్ల రూపాయల నెట్‌ వచ్చింది. అలా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి-2 చరిత్ర సృష్టించింది.

ఇక ఓవరాల్ వసూళ్ల పరంగా కూడా బాహుబలి-2 సినిమా సరికొత్త రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఈ 2 వారాల్లో బాహుబలి-2 సినిమాకు వరల్డ్ వైడ్ 1250 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.