అవును.. మూడు లేదు!

బాహుబలి 3 గురించి రకరకాల ఊహాగానాలు. బాహుబలి 2కి మరింత హైప్ రావాలని ఆ సినిమా టీమ్ ఎన్నో ఫీలర్లు వదిలింది. రిలీజ్ తర్వాత బాహుబలి 3 అనే స్పెక్యులేషన్‌కి తెరలేపింది. 1000 కోట్ల కలెక్షన్ వచ్చిన తర్వాత...అబ్బే అదంతా ఉత్తిదే అని క్లారిటీ ఇచ్చింది.
బాహుబలి సినిమాకు పార్ట్ 3 ఉండదని కథా రచయిత విజయేంద్రప్రసాద్ తేల్చిచెప్పేశారు. బాహుబలి 3 ఉండదు కానీ ఆ సినిమా పేరు మీద, ఆ మూవీ సెట్ మీద బాహుబలి మేకర్స్‌కి మాత్రం ఇంకా చాలా రకాలుగా సంపాదన వస్తూనే ఉంటుంది. ఆ రేంజ్‌లో ఆల్రెడీ వారు అంతా పకడ్బందీ స్కెచ్ వేసి పెట్టారు.
ఇంతకుముందే సోనీ టీవీ చానెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు టీవీ /వెబ్ సిరీస్ కోసం. ఇది త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఆ సిరీస్ అంతా ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లోనే చిత్రీకరణ జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీతో ఒప్పందం కూడా పూర్తయింది. ఎపిసోడ్‌కి కోటిన్నర రూపాయలు నిర్మాతల ఖాతాలో పడుతాయి. బాహుబలి 3కి స్కోప్ లేదు, మూడ్ లేదు. కానీ బాహుబలి టీవీ సిరీస్‌లు, బాహుబలి సెట్‌కి టూరిజం ప్యాకేజ్ టూర్‌లు మాత్రం ఉంటాయి.
- Log in to post comments