ఏడేళ్ల కిందట మొదలైన చరిత్ర

Baahubali began on this day!
Monday, July 6, 2020 - 16:15

జులై 6.. 2013...
సరిగ్గా ఇదే రోజు.. ఏడేళ్ల కిందట ఇదే రోజున ఓ నూతన అధ్యాయానికి బీజం పడింది. ఇప్పుడది చరిత్రగా మారింది. అదే బాహుబలి. అవును.. బాహుబలి ఫ్రాంచైజీకి సంబంధించి ఏడేళ్ల కిందట ఇదే రోజు షూటింగ్ మొదలైంది.

కర్నూలులోని రాక్ గార్డెన్ లో బాహుబలి ఫస్ట్ షాట్ తీశారు. దీనికి సంబంధించి కొన్ని స్టిల్స్ కూడా ఈరోజు షేర్ చేశారు. అప్పట్లో ఆ షూట్ చూసేందుకు వేలాది మంది రాక్ గార్డెన్స్ కు తరలివచ్చారు. అలా ఆర్భాటంగా ప్రారంభమైన బాహుబలి ఫ్రాంచైజీ ఇండియాలో చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

ఇప్పటికీ టాలీవుడ్ లో రికార్డుల్ని నాన్-బాహుబలి-2 రికార్డులుగా చెబుతుంటారు. అంటే ఈ సినిమాను కొట్టిన మూవీ ఇప్పటివరకు తెలుగులో రాలేదన్నమాట. సినిమా రిలీజై ఇన్నేళ్లయినా ప్రభాస్, రానాలను నార్త్ లో ఇప్పటికీ బాహుబలి, భళ్లాలదేవగానే చూస్తారు. అంతలా ఈ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.