బాహుబ‌లి 2 నిడివి రెండు గంట‌ల 50 నిమిషాలు

Baahubali runtime fixed at 170 minutes
Monday, April 24, 2017 - 15:00

బాహుబ‌లి 2 సినిమా ర‌న్ టైమ్ ఎంత అన్న విష‌యంలో ఇక స్పెక్యులేష‌న్స్‌కి తెర‌ప‌డింది. ఈ సినిమా రెండు గంట‌ల యాభై నిమిషాల పాటు ఉంటుంది. సెన్సార్ సర్టిఫికెట్‌లో టైమ్‌ని ఫిక్స్ చేశారు. చాలా రోజులే క్రిత‌మే సెన్సార్ పూర్త‌యింది. కానీ తాజాగా స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. మ‌రోవైపు,  తెలంగాణ‌లో ఐదు షోలు ప్ర‌ద‌ర్శించేందుకు ఈ సినిమాకి అనుమ‌తి ల‌భించింది. హైద‌రాబాద్‌లోని సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బాహుబలి చిత్ర నిర్మాత దేవినేని ప్రసాద్ క‌లిశారు. ఈ నెల 28 న బహుబలి -2 విడుదల సందర్బంగా చిత్రయూనిట్ కు శుభాకాంక్షాలు తెలిపారు మంత్రి. 

''బాహుబలి చిత్రానికి ప్రభుత్వం అన్నిరకాలుగా సహయం అందిస్తుంది. 5 వ షో కు ప్రభుత్వం అనుమతిని అడిగారు. తప్పకుండా ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. బ్లాక్ టికెట్లు అమ్మితే కఠన చర్యలు తీసుకుంటాం. 15 రోజుల్లో అన్ని థియోటర్స్ లో అన్ లైన్ ద్వార టికెట్ల విక్రయాలు చేస్తామ''ని మంత్రి త‌ల‌సాని తెలిపారు. 

''బాహుబలి-2 చిత్రన్ని చూడాలని ప్రభుత్వనికి విజ్జప్తి చేశాం. ప్రభుత్వం అయిదు అటలు అడిపించేందుకు అనుమతి ఇవ్వడం సంతోషమ‌''ని నిర్మాత దేవినేని అన్నారు.