బాల‌య్య బెంట్లీ కారుకి నెం1

Balakrishna bags fancy number for 7 lakhs
Thursday, June 15, 2017 - 13:45

నంద‌మూరి బాలకృష్ణకి ఆయ‌న కూతుళ్లు ఖ‌రీదైన బెంట్లీ కారును ఇటీవ‌ల బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఆ కారు ఖ‌రీదైందే, దాని నెంబ‌రూ కాస్ట్‌లీనే. బుధవారం ఖైరతాబాద్‌లో జరిగిన వేలంలో ఫ్యాన్సీ నెంబ‌ర్‌ని కైవసం చేసుకున్నారు బాలకృష్ణ. ఆయ‌న త‌రపున ఆయ‌న సిబ్బంది ఈ వేలంలో పాల్గొన్నారు. TS 09 EU 0001 ని ద‌క్కింది. బాలకృష్ణ ఈ నెంబ‌ర్‌కి రూ.7.77 లక్షలు వెచ్చించారు.  కారు ధర దాదాపు రూ.3 కోట్లపైనే వుంటుందట‌.

నంద‌మూరి బాలకృష్ణ బర్త్ డేకి ఆయ‌న కూతుళ్లు బ్రాహ్మిణి, తేజ‌స్విని ఈ బెంట్లీ కారుని కొని ప్రెజెంట్ చేశారు. కారు కీస్‌ని పోర్చుగ‌ల్ వెళ్లి అంద‌చేశారు. బాల‌య్య అక్క‌డ పైసా వ‌సూల్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. వ‌చ్చే వారం తిరిగి హైద‌రాబాద్ వ‌స్తాడు.