బాలయ్య అస్సలు తగ్గట్లేదుగా!

Balakrishna not wasting time for Paisa Vasool
Tuesday, July 4, 2017 - 15:00

మొన్నటివరకు పోర్చుగల్ లో భారీ షెడ్యూల్స్ చేసి హైదరాబాద్ వచ్చింది "పైసా వసూల్" యూనిట్. షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మిగతా షూటింగ్ కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ బాలయ్య మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. అవును.. "పైసా వసూల్" కొత్త షెడ్యూల్ అప్పుడే ప్రారంభమైంది.

పైసావ‌సూల్‌.. బాల‌య్య న‌టిస్తున్న 101వ చిత్రం. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. శ్రియా, ముస్కాన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

అన్నపూర్ణ స్టుడియోలో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. దర్శకుడు పూరి జగన్నాథ్ సాంగ్ షూటింగ్ ప్రారంభించాడు. మరో 3,4 రోజుల పాటు ఈ పాట షూటింగ్ ఉంటుంది. తర్వాత మరో 5 రోజుల పాటు యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తారు. దీంతో ప్యాచ్ వర్క్ మినహా సినిమా దాదాపు కంప్లీట్ అయిపోతుందట‌.

ఆగస్ట్ చివరినాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 29న విడుదల చేయాలని నిర్ణయించారు. బాలయ్య సినిమాకు దసరాతో పాటు లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చింది. సెప్టెంబర్ 30 దసరా పడింది. అక్టోబర్ 1 ఆదివారం, తర్వాత అక్టోబర్ 2 సోమవారం నాడు గాంధీ జయంతి పడింది.