బాల‌య్య నిజంగానే పాడేశాడు!

Balakrishna turns singer
Friday, May 12, 2017 - 11:45

ఇప్పటివరకు స్టేజ్ పై మాత్రమే బాలయ్య పాటలు విన్నాం. ఇకపై వెండితెరపై కూడా బాలయ్య గానామృతాన్ని వినొచ్చు. అవును.. నటసింహం మైక్ పుచ్చుకుంది. రసరమ్యంగా ఓ పాట అందుకుంది. 101వ సినిమాలో బాలయ్య స్వయంగా ఆలపించిన సాంగ్ ఉంది. 

గతంలో పలు స్టేజ్ షోల్లో ఫిమేల్ సింగల్స్ తో కలిసి బాలయ్య పాటలు పాడారు. సరదా కోసం కావొచ్చు, ఛారిటీ కోసం కావొచ్చు... పాటలు పాడడం మాత్రం బాలయ్యకు కొత్తకాదు. ఆయన కారులో ప్రయాణిస్తూ కూడా ఉత్సాహంగా పాట అందుకుంటారని దగ్గరివాళ్లు చెబుతుంటారు. ఈ విషయాలన్నీ తెలిసిన పూరి జగన్నాధ్ ఆయన చేతికి మైక్ ఇచ్చేసి, రికార్డింగ్ థియేటర్ లోకి పంపించాడు.

హీరోల్ని యాక్టింగ్ కే పరిమితం చేయడం అటు పూరికి, ఇటు సంగీత దర్శకుడు అనూప్ కు అస్సలు ఇష్టముండదు. వీళ్లిద్దరూ కలిసి ఇప్పుడు బాలయ్యను కూడా వదల్లేదు. తాజాగా ఈ సాంగ్ రికార్డు చేశారు. స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. బాలయ్య 101వ సినిమాకు ఇదే మేజర్ హైలెట్ అంటున్నారు.