బాలయ్యకి మూడు ఝలకులు!

Is Balayya facing three jolts?
Friday, January 24, 2020 - 16:45

బాలయ్య-బోయపాటి సినిమా ఆలస్యమౌతున్న కొద్దీ ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కెమెరామెన్ రాంప్రసాద్ తప్పుకున్నారు. రూలర్ సినిమాలో తనను అందంగా చూపించలేదనే కోపంతో బాలయ్యే, పనిగట్టుకొని రాంప్రసాద్ ను సైడ్ చేశారనే టాక్ ఉంది. ఇప్పుడీ సినిమా నుంచి హీరోయిన్ క్యాథరీన్ త్రెసా కూడా తప్పుతుంది.

అవును.. బాలయ్య సినిమా నుంచి బోయపాటి లక్కీ ఛార్మ్ క్యాథరీన్ తప్పుకుంది. గతంలో బోయపాటి-క్యాథరీన్ కాంబోలో "సరైనోడు"  సినిమా వచ్చింది. ఆ సెంటిమెంట్ కొద్దీ ఇందులో కూడా ఆమెను రిపీట్ చేయాలని చూశాడు బోయపాటి. దీనికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. అయితే రెమ్యూనరేషన్ లో ఏదో తేడా కొట్టి, ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయింది క్యాథరీన్.

కేవలం క్యాథరీన్ మాత్రమే కాదు, సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా మహేష్-వంశీ పైడిపల్లి సినిమాకు కమిట్ అయ్యాడు తమన్. ఈ ప్రాజెక్టు కోసం బాలయ్య సినిమాను వదలుకున్నాడంటూ చిన్న ప్రచారం నడుస్తోంది.

ఇలా బోయపాటి-బాలయ్య సినిమాపై ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3 గాసిప్స్ రౌండ్స్ కొడుతున్నాయి. వీటిపై యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు.