రాజ్ తరుణ్ సినిమా రిలీజ్

Baloon release on Zee5
Thursday, July 9, 2020 - 23:00

రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా కాదిది. అతడు గెస్ట్ రోల్ చేసిన సినిమా. పైగా థియేట్రికల్ రిలీజ్ కాదు. ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఆ సినిమా పేరు బెలూన్. జై, అంజలి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఓ చిన్న గెస్ట్ రోల్ చేశాడు. రేపు ఈ సినిమా జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కు వస్తోంది.

అందరికంటే ముందు డైరక్ట్ ఓటీటీ రిలీజ్ స్టార్ట్ చేసింది ఈ సంస్థే. ఓటీటీలో నేరుగా రిలీజైన స్ట్రయిట్ తెలుగు సినిమాగా అమృతారామమ్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సత్యదేవ్ నటించిన 47 డేస్ అనే సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. ఇప్పుడు బెలూన్ వస్తోంది.

అయితే వీళ్లు పెట్టే సినిమాలేవీ పెద్దగా క్లిక్ అవ్వట్లేదు. కనీసం బెలూన్ అయినా క్లిక్ అవుతుందేమో చూడాలి