బండ్ల గణేష్ ప్లాస్మా ఇస్తాడా?

Bandla Ganesh to donate plasma
Monday, July 20, 2020 - 14:15

ఈ కరోనా టైములో కూడా బండ్ల గణేష్ పేరు మార్మోగింది. కరోనా పాజిటివ్ వచ్చిన మొదటి తెలుగు సినిమా సెలబ్రిటీ అతనే. అంతేకాదు వేగంగా కోలుకున్నాడు కూడా. కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరిస్తోంది ప్రభుత్వం. మరి బండ్ల గణేష్ స్వచ్చందంగా ప్లాస్మా ఇస్తాడా? "నన్ను ఇమ్మని అడిగితే తప్పకుండా ఇస్తా," అని సమాధానం ఇచ్చాడు బండ్ల.

బండ్ల గణేష్ కి కోళ్ల ఫార్మ్స్ ఉన్నాయి. గుడ్లు బాగా తింటాడు. కరోనా వచ్చిన టైంలో కూడా డైలీ మార్నింగ్, ఈవెనింగ్ ఎగ్స్ తిన్నాను అని చెప్తున్నాడు. కరోనా టైంలో మన దైనందిన భోజనంలో ఎగ్స్ మస్ట్ అని సజెస్ట్ చేస్తున్నాడు బండ్ల.

నెక్స్ట్ చేసే సినిమాలు ఏంటి? ప్రస్తుతానికి సినిమా ఆలోచనలు ఏవి లేవు. కాకపోతే తన దేవుడు పవన్ కళ్యాణ్ మరోసారి సినిమా నిర్మించే అవకాశం ఇస్తాడు అని ఎదురుచూస్తున్నాడు ఈ 'గబ్బర్ సింగ్' నిర్మాత.

అన్నట్లు వర్మ తీసిన "పవర్ స్టార్" సినిమాలో బండ్ల గణేష్ పాత్ర కూడా ఉంది. ఈ విషయం గురించి అడిగితే ... నో కామెంట్ అని అంటున్నాడు.