కరోనా దెబ్బకి బండ్ల గణేష్ కుదేలు

Bandla Ganesh tweets about his bad position
Monday, March 30, 2020 - 17:00

కరోనా వల్ల బిజినెస్ లన్ని దెబ్బతిన్నాయి. ఈ ఆర్థిక మాంద్యం ఎన్నాళ్ళు ఉంటుందో ఇప్పుడిప్పుడే ఎవరూ చెప్పలేరు. ఐతే, కరోనా వ్యాధి మన దేశంలో బాగా విజృంభించకముందే కోళ్ల పరిశ్రమ దెబ్బతిన్నది. చికెన్ తో కరోనా వస్తుంది అని "ధేడ్ దిమాక్ వాట్సప్ బ్యాచ్" వార్తలు పుట్టియ్యడంతో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. మొన్నటి వరకు కిలో 40 రూపాయలు పలికింది. ఐతే, రీసెంట్ గా ముఖ్యమంత్రి కెసిఆర్ అందరూ ప్రోటీన్ ఫుడ్ తినాలి, విటమిన్ సి తీసుకోవాలి, బత్తాయి పళ్ళు తినాలి అనేసరికి సీన్ మారింది. లేటెస్ట్ గా చికెన్ ధర 200కి పెరిగింది. 

కానీ ఇప్పటికి పౌల్ట్రీ వ్యాపారాలు దెబ్బతిన్నారు. తెలంగాణలో భారీ ఎత్తున పౌల్ట్రీ వ్యాపారం చేసే వారిలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. ఐతే తన పరిస్థితి పూర్తిగా బాడ్ గా ఉందని అంటున్నాడు బండ్ల. 

"మా పరిస్థితి ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి లా ఉంది కోట్లు పెట్టుబడి పెట్టారము భయంగా వుంది దీనియబ్బ కరోనా," అని ట్వీటాడు గణేష్.