బండ్ల అందర్నీ చుట్టేశాడు

Bandla Ganesh's tweets on Nara Lokesh
Tuesday, May 5, 2020 - 16:45

ఈ నటుడు కమ్ నిర్మాత కమ్ మాజీ పొలిటీషియన్ ఏం మాట్లాడినా అందులో రాజకీయాలు-సినిమా మిక్స్ చేస్తుంటాడు. ఎందుకో ఈ రెండూ కలిపి మాట్లాడ్డం బండ్ల గణేష్ కు చాలా ఇష్టం. ఈసారి కూడా అదే పనిచేశాడు బండ్ల గణేష్. చంద్రబాబు తనయుడు లోకేష్ ను విమర్శించే క్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా అందరి పేర్లు వాడేశాడు.

తను ఏ పార్టీకి చెందనని, తనకు రాజకీయలతో సంబంధం లేదని చెబుతూనే.. నారా లోకేష్ ను విమర్శించాడు బండ్ల గణేశ్. చిరంజీవికి చరణ్ పోటీనిచ్చినట్టు.. కేసీఆర్ కు కేటీఆర్ పోటీనిచ్చినట్టు.. చంద్రబాబుకు లోకేష్ పోటీ ఇవ్వాలని కోరారు. ఎవ్వరు ఏ విధమైన సపోర్ట్ చేయకపోయినా నంబర్ వన్ పొజిషన్ కు వచ్చిన ఎన్టీఆర్ లాగా ఉండాలన్నారు.

ఇలా ఎన్నో ఉదాహరణలు, ఉదంతాలు చెప్పిన బండ్ల గణేష్.. అసలు లోకేష్ కు ఏం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పలేకపోయారు. స్టేజ్ ఎక్కితే గణేష్ స్పీచ్ ఎలా ఉంటుందో.. ఈరోజు ఆయన పెట్టిన ట్వీట్లు కూడా అలానే ఉన్నాయి. ప్రేమతో మీ బండ్ల గణేష్ అంటూ ఫైనల్ గా తన ట్వీట్స్ ఆపేశారు.