బండ్లకి అంతిచ్చారా? ఉత్తి పులిహోరా?

Is Bandla really getting such hefty amount?
Monday, August 5, 2019 - 18:30

బండ్ల గణేష్ మొత్తానికి మేకప్ వేసుకున్నాడు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎక్స్ట్రాలు చేసి గుండు కొట్టించుకున్నాడు. బ్లేడ్ బాబ్జి అనే బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఆ విషయం మళ్లీ తవ్వితే..అదొక పెద్ద స్టోరీ. కట్ చేస్తే... ఇపుడు మళ్లీ సినిమాల్లో వేషాలు వేస్తున్నాడు. బండ్ల గణేష్ అనే కమెడియన్ ఉన్నాడనే విషయమే నేటి తరానికి తెలియదు. అతను ఏమీ ఫామ్ లో లేడు. కేవలం నిర్మాతగా కొంత పరిచయం. పొలిటికల్ బపూనరీతో కొన్నాళ్లూ వార్తల్లో ఉన్నాడు. అంతకుమించిన సీన్ ఏమీ లేదు బండ్లకి.

ఐతే బండ్ల గణేష్ ఈ రోజు (ఆగస్ట్ 5) నుంచి సినిమా షూటింగ్  పాల్గొంటుండడంతో అతని రెమ్యునరేషన్ గురించి స్టోరీస్ వచ్చాయి. రోజుకి ఐదు లక్షల పారితోషికం బండ్లకి ఇస్తున్నారనేది వీటి సారాంశం. రావు రమేష్ లాంటి బిజీ యాక్టర్ కే అంతిస్తున్నారు. మరి బండ్లకి కూడా అంతెందుకు ఇస్తారు? ఐదు రోజుల కాల్షిట్లు తీసుకున్నా పాతిక లక్షలు ఇవ్వాలి. పది రోజులు అయితే 50 లక్షలు అవుతుంది. మరి బండ్లకి నిజంగా అంత మొత్తం ఇచ్చే సీన్ ఉందా? లేక ఆయనది రెండు, మూడు రోజులకి మించని పాత్రనా? లేదా బండ్లకి హైప్ ఇవ్వడానికి అల్లిన ప్రచారమా ఇది? దీన్నే పులిహోరా కలపడం అంటారు... ఏమీ లేకున్నా ఏదో ఉన్నట్లు బిల్డప్ ఇవ్వడం.

ఏదీ అయినా ఆశ్చర్యపోవద్దు. అక్కడున్నది బండ్ల... మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడాడో చూశాం కదా.