అశోక్‌జీకి అడ్వాన్స్‌లు రావ‌ట్లేదా?

Bhaagamathie director Ashok G not getting new offers?
Monday, February 5, 2018 - 15:30

హిట్ ఇస్తే వెంట‌నే క‌ర్చీఫ్‌లు వేస్తారు మ‌న నిర్మాత‌లు. హీరోకైనా, హీరోయిన్‌కైనా, డైర‌క్ట‌ర్‌కైనా అడ్వాన్స్ రుమాళ్లు త‌ప్ప‌వు. ఈ ఏడాది తొలి బిగ్ హిట్‌..."భాగ‌మ‌తి". ఐనా ఆ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తామ‌ని నిర్మాత‌లు క్యూ క‌ట్ట‌డం లేద‌ట‌. విచిత్రంగా ఉంది క‌దూ. కానీ ఇది నిజ‌మే అని అంటున్నారు టాలీవుడ్ గూఢాచారులు.

"భాగ‌మ‌తి" హిట్‌కి ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ క‌న్నా.. అనుష్కకున్న క్రేజ్‌, సాంకేతిక నిపుణుల ప‌నిత‌నం...అన్నింటిక‌న్నా టైమింగ్ క‌లిసొచ్చాయ‌నేది టాలీవుడ్ వ‌ర్గాల భావ‌న‌. సంక్రాంతికి విడుద‌లైన సినిమాలు నిరాశ‌ప‌ర్చ‌డంతో జ‌నం ఒక పెద్ద సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైమ్లో ప‌డింది "భాగ‌మ‌తి". అలా హిట్ట‌యింది అనేది వారి అభిప్రాయం.

పైగా ద‌ర్శ‌కుడు అశోక్ గ‌త సినిమాలు "సుకుమారుడు", "చిత్రాంగ‌ద" చూసిన వారికెవ‌రికైనా అశోక్ జి టాలెంట్ మీద అంత ఈజీగా న‌మ్మ‌కం కుద‌రదు కదా. అందుకే ఇపుడు భాగ‌మ‌తి హిట్‌ని అశోక్ క్యాష్ చేసుకోలేక‌పోతున్నాడ‌ట‌.