బాలీవుడ్ వినయ విధేయ రామా?

Bhaagi 3 looks like Tadhaka and Vinaya Vidheya Rama
Thursday, February 6, 2020 - 15:00

బాలీవుడ్ లో యాక్షన్ స్టార్ గా యూత్ లో, మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో.. టైగర్ ష్రాఫ్. కండలవీరుడు అనిపించుకుంటున్న టైగర్  నటించిన కొత్త చిత్రం... "భాగీ 3". తాజాగా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ చూస్తే... సునీల్, నాగ చైతన్య నటించిన 'తడాకా' సినిమా గుర్తొస్తోంది. కానీ యాక్షన్, సిరియా బాక్ డ్రాప్, అన్నయ్య కిడ్నాప్ వంటివి చూస్తే... వినయ విధేయ రామ అనిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్ గా అనిపిస్తున్న యాక్షన్ సీన్లు అచ్చంగా బోయపాటి పూనకం వహించి తీసినట్లే ఉన్నాయి. ఇది బాలీవుడు వినయ విధేయ రామనా? అన్నది చూడాలి. 

ఈ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు కూడా తెలుగు సినిమాలకి రీమేక్ లే. మొదటి భాగం.. వర్షం సినిమాకి రీమేక్. రెండో భాగంలో 'క్షణం' తో పాటు మరో మూవీ కలిపి తీశారు. ఇప్పుడు మూడో భాగం ఇలా అనిపిస్తోంది. 

విమర్శలు ఎలా వున్నా టైగర్ ష్రాఫ్ సినిమాలు అంటే బాలీవుడు మాస్ ప్రేక్షకులు పడి చస్తున్నారు. ఈ తరానికి హ్రితిక్ అన్న పేరు ఉంది ఈ కుర్ర హీరోకి.