వేరే కోణంలో వచ్చిన భీష్మ

Bheeshma gets different angle
Sunday, January 12, 2020 - 23:00

నితిన్-రష్మిక ఫ్రెష్ కాంబినేషన్. పైగా రష్మిక ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉంది. వీటన్నింటికీ మించి సినిమా పక్కా లవ్ స్టోరీ. కాబట్టి భీష్మ టీజర్ లో నితిన్-రష్మిక కెమిస్ట్రీని ఓ రేంజ్ లో ప్రజెంట్ చేస్తారని అంతా భావించారు. కానీ అక్కడ మరోటి ప్రత్యక్షమైంది. టీజర్ స్టార్టింగ్ లోనే యాక్షన్ లుక్ లో దర్శనమిచ్చాడు నితిన్. ఆ తర్వాత కొన్ని కామెడీ పంచ్ లు చూపించారు. మధ్యమధ్యలో కీలకమైన నటీనటుల్ని పరిచయం చేశారు. 

ఫస్ట్ గ్లింప్స్ లో రష్మిక వెంటపడతాడు నితిన్. ఆ షాట్ అదిరిపోయింది. అలాంటి మరిన్ని కట్స్ టీజర్ లో ఉంటాయని భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. 2-3 ఫ్రేమ్స్ తోనే నితిన్-రష్మిక జోడీని సైడ్ చేశారు. కావాలనే టీజర్ లో అలా చేశారా లేక సినిమా మొత్తం వేరే జానర్ లో ఉంటుందా అనే సస్పెన్స్ లో ప్రేక్షకుల్ని పడేసింది భీష్మ టీజర్.

అయితే, ఈ టీజర్ కి జనం నుంచి రెస్పాన్స్ బాగుంది.