సవ్యసాచికి సొంత డబ్బింగ్

Bhumika to dub her voice in Telugu for Savyasachi
Friday, December 29, 2017 - 22:30

నాగచైతన్య హీరోగా నటిస్తున్న "సవ్యసాచి" సినిమాలో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోందనే విషయం పాతదే. ఈ సినిమాలో నాగచైతన్యకు ఆమె అక్కగా కనిపించనుంది. ఇది కూడా ఓల్డ్ న్యూసే. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాకు తనే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోనుంద‌ట‌.

"నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచిలో నేను నటిస్తున్నాను. చైతూకు అక్కగా కనిపిస్తాను. ఆ మూవీలో చాలా కీలకమైన పాత్ర నాది. ఉండేది కాసేపే అయినా నా పాత్రతోనే అసలు కథ మొదలవుతుంది. అంతేకాదు.. ఈ సినిమాకు నేను సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నాను," అని భూమిక మీడియాకి తెలిపింది.

తనకు తెలుగు బాగా వచ్చని, అయితే తప్పులు మాట్లాడతానేమో అనే భయం తనలో ఉండేద‌ని చెప్పుకొచ్చింది భూమిక. చందు మొండేటి ఇచ్చిన ప్రోత్సాహంతో "సవ్యసాచి"కి తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నానని అంటోంది.