బెంజ్ రేంజ్ కి వచ్చిన సిప్లిగంజ్

Bigg Boss 3 winner Rahul Sipligunj buys Benz
Sunday, January 5, 2020 - 18:30

తను ఓ మ్యూజికల్ కన్సర్ట్ చేస్తే పైకి చెప్పుకోలేనంత తక్కువగా డబ్బులిస్తారని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. సినిమాల్లో పాటలకు కూడా అతి తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలిపాడు. అందుకే తన సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకోలేకపోయానని చెప్పాడు. అదే టైమ్ లో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా గెలిచాడు రాహుల్. దీంతో సొంతిల్లు కొనుక్కుంటానని, అమ్మా-నాన్నను చక్కగా చూసుకుంటానని చెప్పాడు.

కట్ చేస్తే.. కాస్ట్ లీ కారు కొనుక్కున్నాడు రాహుల్. ఇంటి సంగతేమోకాని, ఇప్పుడు ఏకంగా బెంజ్ ఓనరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ గెలిచిన తర్వాత రాహుల్ ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. పాటల అవకాశాలు కూడా అందుకున్నాడు. ప్రైజ్ మనీతో పాటు బయట కూడా బాగానే డబ్బులు వచ్చాయి. అందుకే ఓవైపు సెలూనే ఫ్రైంచైజీ ఓపెన్ చేయడంతో పాటు ఇలా బెంజ్ కారుకు ఓనర్ అయ్యాడు.

బెంజ్ కారు కొన్న స్టిల్స్ ను సోషల్ మీడియాలో పెట్టాడు రాహుల్. దీంతో అతడి అభిమానులు వరుసపెట్టి అతడికి కంగ్రాట్స్ చెబుతున్నారు.