బిగ్ బాస్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చిన బాస్

Bigg boss Ratings
Thursday, November 14, 2019 - 14:30

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షో నుంచి తిరిగి నంబర్ వన్ స్థానానికి వచ్చేసింది స్టార్ మా ఛానెల్. అలా ప్రతి వీకెండ్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ, దిగ్విజయంగా పూర్తిచేశాడు నాగ్. అయితే బిగ్ బాస్ సీజన్-3లో ప్రసారమైన ఎపిసోడ్స్ అన్నీ ఒకెత్తయితే.. గ్రాండ్ ఫినాలే మరో ఎత్తు. టాలీవుడ్ బాస్ గా అందరూ పిలిచే రియల్ బాస్ చిరంజీవి, ఫైనల్స్ కు రావడంతో టీఆర్పీలు మోతెక్కిపోతాయి. మెగాస్టార్ రాకతో సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి.

బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు 17.66 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. బిగ్ బాస్ కు ఈ రేటింగ్ కొత్తకాదు. కానీ ఫినాలేలో చిరంజీవి ఎంటరైన తర్వాత వచ్చిన రేటింగ్ మాత్రం నభూతో అనే రేంజ్ లో ఉంది. అవును.. మెగాస్టార్ క్లయిమాక్స్ పార్ట్ కు అత్యధికంగా  22.4 టీఆర్పీ వచ్చింది. 

 

బిగ్ బాస్ చరిత్రలోనే ఇది అత్యధికం. గతంలో ఎన్టీఆర్, నాని చేసినప్పుడు సైతం గ్రాండ్ ఫినాలేకు ఈ టీఆర్పీలు రాలేదు. అంతెందుకు, బార్క్ అమల్లోకి వచ్చిన తర్వాత తెలుగు టెలివిజన్ చరిత్రలోనే టాప్-5 టీఆర్పీల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. అలా బిగ్ బాస్ సీజన్ 3కి తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు చిరంజీవి.