బాబు గోగినేని బిగ్ హౌస్ నుంచి ఇంటికి

Bigg Boss Telugu 2: Babu Gogineni is evicted?
Saturday, August 11, 2018 - 23:15

బిగ్‌బాస్ 2 హౌస్ నుంచి బాబు గోగినేని త‌న సొంతింటికి వ‌చ్చేస్తున్నాడు. ఈ ఆదివారం అత‌న్ని ఎలిమినేట్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే తేజ‌స్వి, నందిని, భానుశ్రీ వంటి వారు ఎలిమినేట్ అయ్యారు. యాంక‌ర్ శ్యామ‌ల ఎలిమినేట్ మ‌ళ్లీ జాయిన్ అయింది. ఈ వీకెండ్ బాబు గోగినేనిని ఇంటికి పంపిస్తున్నార‌ట‌. ఆదివారం రాత్రి షోలో ఎలిమినేష‌న్‌ని ప్ర‌క‌టిస్తార‌ని టాక్‌.

ఈ వారంలో ఎలిమినేషన్ రౌండ్‌లో బాబు గోగినేని, తనీష్, దీప్తి, గణేష్, శ్యామల, గీత మాధురి ఉన్నారు. అయితే, వీరిలో త‌క్కువ ఓటింగ్ ట్రెండ్ బాబు గోగినేనికే క‌నిప‌స్తోంది. అంటే ఈ వీకెండ్ ఎలిమినేష‌న్‌లో బాబు గోగినేనిని ఇంటికి పంప‌డం ఖాయ‌మే. బాబు గోగినేనికి హేతువాదిగా పేరుంది. పండుగ‌ల టైమ్‌లో టీవీల్లో ఆచారాలు, మూఢ‌న‌మ్మ‌కాల వంటి వాటిపై జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో రేష‌న‌ల్‌గా మాట్లాడుతూ పాపులారిటీ సంపాదించారు. బేసిక్‌గా విజ‌య‌వాడ‌కి చెందిన గోగినేని...చాలా కాలంగా హైద‌రాబాద్‌లోనే స్థిర‌ప‌డ్డారు. 

రెండు వారాల క్రితం బిగ్‌బాస్ షోలో ఆయ‌న చేసిన కామెంట్స్ ఆయ‌న మేధావిత‌నంలోని డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టింది. అలా అన్‌పాపుల‌ర్ అయ్యారు.