"గరంగరం" అమ్మాయిలతో సత్తి

Bithiri Sathi's Garam Garam Anchors
Monday, August 3, 2020 - 15:45

కొత్త మేనేజిమెంట్ పిచ్చి చేష్టల వల్ల టీవీ9ను వదిలేసి సాక్షి ఛానెల్ లో చేరిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన డిఫరెంట్ స్టయిల్, మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బిత్తిరి సత్తి.. "గరంగరం వార్తలు" అనే కార్యక్రమంతో సాక్షిలో ప్రత్యక్షమయ్యాడు.

ఈ కార్యక్రమం రూపురేఖలు ఎలా ఉంటాయి.. ఎవరెవరు ఉంటారు అనే విషయాల్ని ప్రారంభ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఈసారి శివజ్యోతి స్థానంలో ఓ కొత్త యాంకర్ ను తీసుకున్నారు.

శివజ్యోతి, సత్తిది సూపర్ హిట్ కాంబినేషన్. కానీ టీవీ9 నుంచి సత్తి బయటకు వచ్చినప్పటికీ.. శివజ్యోతి మాత్రం అక్కడే కొనసాగుతోంది. దీంతో తన కొత్త ప్రొగ్రామ్ కోసం వార్తల వాణి అనే కొత్తమ్మాయిని యాంకర్ గా పరిచయం చేస్తున్నాడు సత్తి. అంతేకాదు... దిల్ ఖుష్ దివ్య (ఇంతకుముందు టిక్ టాక్ స్టార్) అనే మరో అమ్మాయిని కూడా పరిచయం చేస్తున్నాడు. వాణి యాంకర్ గా, దివ్య రిపోర్టర్ గా కనిపించబోతున్నారు.

ప్రముఖ నటుడు తణికెళ్ల భరణి ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.